భారత్‌ను కట్టడి చేసిన వెస్టిండీస్‌

కోల్‌కత్తా: ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్‌ను వెస్టిండీస్‌ బౌలర్లు కొంత మేరకు కట్టడి చేయగలిగారు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన వెస్టిండీస్‌ ఈ మ్యాచ్‌లోనైనా కాస్తా మెరుగ్గా ఆడి పరువు నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉంది.

బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌ ఎవరు కూడా భారీ స్కోరు సాధించలేకపోయారు. కోల్‌కత్తా ఈడెన్‌ గార్డెన్స్‌లో రికార్డు సృష్టించిన హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ వి.వి.యస్‌. లక్ష్మన్‌ 48 పరుగులు మాత్రమే చేసి ప్రేక్షకులను నిరుత్సాహపరిచాడు. ఓపెనర్‌ సంజయ్‌బంగర్‌ 77 పరుగులు సాధించాడు. ఆట ముగిసే సమయానికి పార్థీవ్‌ పటేల్‌ 18 పరుగులతోను, హర్భజన్‌ మూడు పరుగులతోను క్రీజ్‌లో ఉన్నారు.

వెస్టిండీస్‌ బౌలర్లలో డిల్లాన్‌ రెండు వికెట్లు తీశాడు. కఫీ, లాసన్‌, పావెల్‌, హూపర్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది. భారత కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ 30 పరుగులు మాత్రమే చేసి హూపర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+