అసమ్మతివాదులపై చర్యలు: కోహ్లి
సివ్లూ: సంప్రదింపులు ఫలించకపోతే ఉత్తరప్రదేశ్ తిరుగుబాటుదారులపై తగిన చర్య తీసుకోనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఒ.పి. కోహ్లి చెప్పారు.
హిమాచల్‌లో డీలిమిటేషన్‌పై కొంత మంది పార్టీ రాష్ట్ర నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన ఆక్షేపణ తెలియజేశారు. ఈ విధమైన చర్యలను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించి చర్య తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. డీలిమిటేషన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, దానిపై ప్రభుత్వ నియంత్రణ ఉండదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
