రాష్ట్రంలో సెల్‌ వన్‌సేవలు ప్రారంభం

లక్నో: మాయవతి సంకీర్ణ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతోన్న సంక్షోభం బుధవారం మరింత ముదిరింది. తమ పార్టీ నేతలకు డబ్బులు ఎరవేసి మాయవతి లాగలని ప్రయత్నిస్తుందని సమాజ్‌ వాది పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. బిజెపి నేతలు వినయ్‌ కటియర్‌, లాల్జీ టాండన్‌, ముఖ్యమంత్రి మాయవతిలు మా పార్టీ నేతలకు మంత్రి పదవులు ఇస్తామని నిన్న రాత్రి సందేశాలు పంపించారు. అలాగే సూట్‌ కేసుల్లో డబ్బు పట్టుకెళ్ళి అడ్వాన్స్‌ లు ఇచ్చేందుకు ప్రయత్నించారని సమాజ్‌ వాది పార్టీ నేత అమర్‌ సింగ్‌ బుధవారం లక్నోలో ఆరోపించారు.

దీంతో మాయవతి ప్రభుత్వం పూర్తిగా కష్టాల్లో ఉందని అందరికీ అవగతమవుతోంది. అంతేకాకుండా, పార్టీ నుంచి సస్పెన్సన్‌ కు గురైన బిజెపి ఎమ్మెల్యేలు తమ పట్టును వీడడం లేదు. రాష్ట్ర బిజెపి శాసనసభా పక్షనేత లాల్జీ టాండన్‌ రాజీనామా చేస్తేనే తాము తిరిగి బిజెపిలో చేరుతామని తిరుగుబాటు నేత గంగా భక్త్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

అసంతృప్తులను బుజ్జగించేందుకు మాజీ ముఖ్యమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. మరోవైపు, యూపీలో ఇప్పుడిప్పుడే కొంపలు మునిగే పరిస్థితి లేదని కాంగ్రెస్‌ తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు సమాజ్‌ వాదీ పార్టీ నేతలు చేస్తోన్న ప్రయత్నాలకు కాంగ్రెస్‌ మౌనమే సమాధానంగా మద్దతు ఇస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+