హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫలితాల ఆధారంగా సిబ్బందికి ప్రోత్సహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన గురువారం ప్రసంగించారు.
ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు పని చేయాలని, ప్రమాణాలు పెంచాలని ఆయన అన్నారు. కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచాలని ఆయన ప్రిన్సిపాళ్లకు సూచించారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయి విద్యను పటిష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. ఇంటర్మీడియట్ విద్యకు నిధుల కొరత లేదని, యేటా ప్రభుత్వం 220 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు.