సంక్షోభంలో మాయావతి సర్కార్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. బిజెపికి చెందిన 12 మంది అసమ్మతి శాసనసభ్యులు గురువారం మాయావతి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకున్నారు. బలనిరూపణకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో మాయావతి మంత్రివర్గం మెజారిటీ కోల్పోయిందని, అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సిందిగా మాయావతికి సూచించాలని వారు గవర్నర్‌తో చెప్పారు. ఎనమండుగురు ఇండిపెండెంట్ శాసనసభ్యులు బిఎస్‌పి- బిజెపి సంకీర్ణ ప్రభుత్వానికి గత వారమే తమ మద్దతు ఉపసంహరించుకున్నారు.












Click it and Unblock the Notifications