కాంగ్రెస్, పిడిపిలపై వెంకయ్య ధ్వజం
హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్- పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) సంకీర్ణం ప్రజాకర్షక విధానాలను అనుసరిస్తోందని, ఇది వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని, జాతీయ ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.
కాంగ్రెస్, వామపక్షాల ద్వంద్వ వైఖరులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బిజెపి రాజకీయ వెసులుబాటు చాలా ఉన్నదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయడం ద్వారా, ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరులను ఎత్తి చూపడం ద్వారా ఆ వెసులుబాటును పొందాలని ఆయన ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు.












Click it and Unblock the Notifications