వ్యాధుల నివారణకు ప్రణాళిక: బాబు

వరంగల్‌/హైదరాబాద్‌: అంటువ్యాధుల నివారణకు రెండు మూడు రోజుల్లో ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఆయన గురవారం వరంగల్‌ జిల్లాలో పర్యటించారు.

వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలో పిల్లల మరణాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐదుగురు సభ్యులతో ఒక నిపుణుల కమిటీని వేశారు. 48 గంటల్లో ఈ నిపుణుల కమిటీ తన నివేదికఅందజేస్తుందని ఆయన చెప్పారు. పిల్లల మరణాలు సంభవించిన కొండపర్తి, ఇల్లందు గ్రామాలను ఆయన సందర్శించి బాధితులను పరామర్శించారు. పిల్లలను కోల్పోయిన తల్లులను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని హితవు చెప్పారు. మరణించినవారి కుటుంబాలకు 50 వేల రూపాయలేసిఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

వరంగల్‌ నగర పాలక సంస్థ ఎదుటే పారిశుధ్యం లోపించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కమీషనర్‌పై ఆయన మండిపడ్డారు. జనగాం ఆర్డీవోను రికాల్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్వాక్రా, ఇతర సంఘాల ద్వారా క్లీనింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. వింత వ్యాధి సోకిన వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు పర్యటించి పరిస్థితి సమీక్షించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే, విషజ్వరం సోకి సంభవించిన పిల్లల మరణాల సంఖ్య 87కు చేరుకుంది. కొత్తగా కరీంనగర్‌ జిల్లాలో నలుగురు, వరంగల్‌ జిల్లాలో ఐదుగురు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు మరణించారు. శుక్రవారంనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దూరదర్శన్‌లో పిల్లల ఆరోగ్యం గురించి ప్రజల సందేహాలను తీర్చనున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+