ఉస్మానియా నిర్లక్ష్యం: అభాగ్యుడి మృతి
హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రివైద్యుల నిర్లక్ష్యానికి మరో అభాగ్యుడు ప్రాణాలుకోల్పోయాడు. రాజమండ్రికి నుంచి నగరానికివచ్చి పంజాగుట్టలో కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోన్న ఓవ్యక్తిని బుధవారం రాత్రి ఆటో వచ్చి ఢీకొంది. తీవ్రంగాగాయపడ్డ అతను రోడ్డు మీదే గాయాలతోస్పృహతప్పిపడిపోయాడు. ఆ సమయంలో జోరుగావర్షం పడుతుండడంతో రోడ్డుపై పెద్ద సంచారంలేదు. కొంతమంది అతన్ని వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడినుంచి అతన్ని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికిపంపారు. రాత్రి అతన్ని అడ్మిట్ చేసుకునేందుకు ఆసుప్రతిసిబ్బంది నిరాకరించడంతో..వైద్యం అందక అతను మృతి చెందాడు.అప్పటికే అతని బంధుమిత్రులు వచ్చి మృతిచెందిన వ్యక్తిని మార్చూరీలో ఉంచేందుకుప్రయత్నించగా, మార్ఛూరీ రూంకి తాళం వేసి వాచ్‌మెన్ రెండున్నర గంటల పాటు పత్తాలేకుండాపోయాడు. దీంతో మృతదేహాన్ని రాత్రంతావర్షంలోనే ఉంచాల్సి వచ్చిందని బంధువులు తెలిపారు. గురువారంఉదయం ఉన్నతాధికారులు వైద్య సిబ్బందినిప్రశ్నించగా, అభియోగాన్ని సిబ్బంది ఒకరిపై ఒకరునెట్టుకుంటూ...వాగ్వివాదానికి దిగారు.












Click it and Unblock the Notifications