ఎపిలో పొత్తులుండవు: వైయస్సార్
హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తుకు అవకాశం లేదని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. సివ్లూలో జరిగిన పార్టీ మేధోమథన సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన ఆయన శుక్రవారంవిలేకరులతో మాట్లాడారు.
సివ్లూ నిర్ణయాలను రాష్ట్రంలో తమకు అనుకూలంగా మలుచుకుంటామని ఆయన చెప్పారు. ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తు ఉన్నా, లేకున్నా ఆంధ్రప్రదేశ్‌లో తేడా ఏమీ ఉండదని ఆయన అన్నారు. ప్రధాన పోటీ తెలుగుదేశం, కాంగ్రెస్‌ల మధ్యే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. ప్రజలకు ఉచితవిద్యత్తును అందించవచ్చునని, అయితే అలా ఇస్తే ప్రపంచబ్యాంక్‌అప్పులు రావని చంద్రబాబు అనడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ విధంగా అన్నారు. ప్రజల మేలు గురించికన్నా చంద్రబాబు నాయుడు ప్రపంచబ్యాంక్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.ట్రాన్స్‌కోకు సబ్సిడీ ఇచ్చి రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వవచ్చునని ఆయన అన్నారు. ఈవిషయంలో ఇబ్బంది వచ్చిన ప్రపంచబ్యాంక్ సర్దుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications