నా భర్తను విడిపించండిః లక్ష్మణ్‌ భార్య

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 07-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌ః కిడ్నాపైన రాష్ట్రపౌరహక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ను విడిపించవలసిందిగా ఆయన భార్య సుజాత శుక్రవారంఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసివిజ్ఞప్తి చేశారు. సుజాతతో పాటు ఆమె పిల్లలు,ప్రజాగాయకుడు గద్దర్‌ ముఖ్యమంత్రినికలిశారు.

లక్ష్మణ్‌ ను విడిపించేందుకుఅవసరమైతే ప్రత్యేక దళాలను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు శాఖనుఆదేశించారు. లక్ష్మణ్‌ కిడ్నాప్‌ పై ఆయన శుక్రవారంఉదయం హోంమంత్రి దేవేందర్‌ గౌడ్‌, డిజిపిసుకుమారతో చర్చించారు. లక్ష్మణ్‌ వృత్తి రీత్యాలెక్చరర్‌.

విప్లవ రచయితల సంఘం బషీర్‌ బాగ్‌ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన ఒక సభలో ప్రసంగించిన తర్వాత ఇంటికివెళ్తున్న లక్ష్మణ్‌ ను కొందరు కిడ్నాప్‌చేశారు. నక్సలైట్ల వద్ద బందీగా ఉన్న సిరాజ్‌ను విడుదల చేయించేందుకు ఈ కిడ్నాప్‌ చేసినట్టు తిరుమలటైగర్స్‌ నాయకుడు సింగమలై పత్రికాకార్యాలయాలకు ఫోన్‌ చేశాడు.

తిరుమల టైగర్స్‌,సింగమలై అనుమానాస్పదమని,పోలీసులే ఈ టైగర్స్‌ అవతారమెత్తారని పౌరహక్కుల సంఘంనాయకులు అంటున్నారు. గతంలో కూడా గ్రీన్‌ టైగర్స్‌పేరిట పోలీసులు ప్రజా సంఘాల నాయకులపైదాడులు చేశారని వీరు అంటున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి