తారల జోరు- అభిమానులు బేజారు
Posted on 15-11-03
హైదరాబాద్: హైదరాబాద్ లోనిఎల్.బి.స్టేడియంలో జరుగుతోన్న వన్డే మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చారు. అయితే, వీరిని అదుపుచేసేప్రయత్నంలో పోలీసులు అతిగా స్పందించి లాఠీచార్జీజరిపారు. టికెట్లు కొనుక్కొని ఆటనుతిలకించేందుకు వచ్చిన వారిని కూడా పోలీసులునిరోధించి, వారిపై తమ లాఠీలను ఝళిపించారు.చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
మరోవైపు, టికెట్లులేకున్నా, పలుకుబడి ఉన్న వ్యక్తులను పోలీసులుధర్జాగా అనుమతించారు. ఒకవైపు సచిన్, సెహ్వాగ్‌లో జోరుగా ఆడుతూ అభిమానులను అలరించగా, సినిమాతారలు వెంకటేష్, శ్రీకాంత్ లు కూడాప్రేక్షకులలో కలిసి భారత్ కు మద్దతు తెలుపుతూఅందర్నీ అలరించారు. భారత్ జెండాలు పట్టుకొనివెంకటేష్ ఈలలు వేస్తూ..భారత్ క్రికెటర్లకుమద్దతు పలికాడు.












Click it and Unblock the Notifications
