బాబు రాజకీయ దివాళాకోరు: కాంగ్రెస్‌

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 15-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ను, నక్సలైట్లను ఒక గాటన కట్టేయడం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజకీయ దివాళాకోరుతనమని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.అసెంబ్లీ రద్దుపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధికె. రోశయ్య శనివారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.

నక్సలైట్‌ సమస్యను 15 యేళ్లలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని ఆయన అన్నారు. అటువంటప్పుడు ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్లారని ఆయన అడిగారు. రాష్ట్రంలో అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయామని చంద్రబాబు అన్నడాన్ని ప్రస్తావిస్తూ అభివృద్ధి వజ్రాయుధం మొక్కవోయిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించలేదని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X