Home

Posted on 18-11-03

కాంగ్రెస్‌తో పరిమిత అవగాహన: సిపిఎం

హైదరాబాద్‌: వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమకు పరిమిత అవగాహన ఉంటుందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ చెప్పారు. సిపిఐతో కలిసి పోటీ చేస్తామని ఆయన మంగళవారం ఇక్కడవిలేకరుల సమావేశంలో చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)తో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. తాముసమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తాము పరిమితసీట్లలో మాత్రమే పోటీ చేస్తామని, తమకు పూర్తి బలం ఉన్న స్థానాల్లోనే అభ్యర్థులను నిలుపుతామని ఆయన చెప్పారు. లౌకిక పార్టీఅయినందున కాంగ్రెస్‌తో తాము అవగాహనకు వస్తున్నామని ఆయన చెప్పారు. తమ ఎన్నికల వ్యూహం త్వరలో ఖరారవుతుందని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే, ఎన్నికల పొత్తుపై సిపిఎం, సిపిఐల మధ్య మంగళవారం చర్చలు జరిగాయి. కాంగ్రెస్‌తో కుదుర్చుకోవాల్సిన అవగాహనపై కూడా సిపిఐ కార్యాలయం మఖ్దూం భవనల్‌లో జరిగిన ఇరు పార్టీల సమావేశంలో చర్చ జరిగింది. 1999 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే పని చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+