స్టాంపుల స్కామ్‌ తీవ్రమైంది: అద్వానీ

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 20-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

భోపాల్‌: కోట్లాది రూపాయల తెల్గీ స్టాంపుల కుంభకోణం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ అన్నారు. ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తునకు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఎందుకు చొరవ చూపడం లేదోఅర్థం కావడం లేదని ఆయన అన్నారు.

కర్ణాటక, మహారాష్ట్రలలోనే ఈ కుంభకోణం పెద్ద స్థాయిలో జరిగిందని, అయితే సిబిఐ దర్యాప్తును కోరడానికి ఈ రెండు రాష్ట్రాలు విముఖత ప్రదర్శిస్తున్నాయని, దానికి కారణలేమిటో తనకు అర్థం కావడం లేదని ఆయన గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తనను కలిశారని, అయితే స్టాంపుల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు కోరలేదని, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఢిల్లీ ప్రభుత్వాలు సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరాయని ఆయన చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి