ప్రజా స్పందన అపూర్వం: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 20-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

గుంటూరు: గుంటూరు సభకు ప్రజల స్పందన చూస్తే తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తోందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు సభకు అనుకున్నదాని కన్నా ఎక్కువ స్థాయిలోవిజయవంతమైందని ఆయన గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు.

ప్రజలకు సేవ చేసేవారికే ప్రజలు ఓటు వేస్తారని, ప్రజల ఆలోచనాసరళిలో మార్పు వచ్చిందని, మంచీచెడు బేరీజు వేసుకుని ఓటు చేసే చైతన్యం పెరిగిందని ఆయన అన్నారు. తాము రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ బలహీనపడలేదని ఆయన అన్నారు. కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టును నిర్మిస్తామని, ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌కు స్పష్టమైన వైఖరి లేదని ఆయన అన్నారు. గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకుంటామని ఆయన చెప్పారు. సేవాభావంతో పని చేసేవారికే ప్రజలు ఓటు వేస్తారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తటస్థులకు టికెట్లు ఇస్తామని ఆయన చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి