సిపిఐతో టిఆర్‌ఎస్‌ దోస్తీ లేనట్లే!

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 20-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

విజయవాడ: తాము సమైక్యాంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని సిపిఐ నాయకుడు దాసరి నాగభూషణరావు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నవారితో తమకు ఏ విధమైన అవగాహన ఉండదని ఆయన గురువారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితితో సిపిఐ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటుందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దాసరి నాగభూషణరావు ప్రకటన వెలువడింది. దీన్ని బట్టి సిపిఐ టిఆర్‌ఎస్‌తో ఏ విధమైన పొత్తుకు సిద్ధంగా లేదని తేలిపోయింది. టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోబోమని మరో వామపక్ష పార్టీ సిపిఎం బుధవారంనాడే స్పష్టం చేసింది. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయనే ప్రచారానికి దీంతో తెరపడింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X