దేశాభివృద్ధిలో వర్శిటీల పాత్ర: రాష్ట్రపతి

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 20-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

తిరుపతి: విశ్వవిద్యాలయాలు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ సూచించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలను ఆయన గురువారం ప్రారంభించారు.

2020 నాటికి దేశం స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందిన దేశాల పక్కన నిలబడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. అంతకు ముందు గురువారంనాడు ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్‌, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్వాగతం చెప్పారు. కార్యక్రమం అనంతరం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు బర్నాలా, చంద్రబాబు స్వామివారిని దర్శించుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి