ఆ హక్కు బాబుకు లేదు: కెసిఆర్‌

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 20-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని పోలీసు కేసులో ఇరుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వేర్పాటువాదం గురించి మాట్లాడే అర్హత లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని అంటున్న తెలుగుదేశం నాయకులు, వామపక్షాల నాయకులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తేనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్న చంద్రబాబు గతంలో జై ఆంధ్ర ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నారని ఆయన అడిగారు. విడిపోతేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి