అస్సాం హింసపై లాలూకు పిఎం హామీ

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 20-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

పాట్నా: అస్సాంలో బీహారీలపై జరుగుతున్న హింసాకాండను సమర్థంగా ఆపుతామని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు హామీ ఇచ్చారు.

అస్సాంకు మరిన్ని కేంద్ర బలగాలను పంపుతామని ప్రధాని చెప్పారు. వాజ్‌పేయితో టెలిఫోన్‌లో మాట్లాడిన అనంతరం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బుధవారంవిలేకరులతో ఆ విషయాలు చెప్పారు. శాంతిసారస్యాలను, సహోదరత్వాన్నిపెంపొందించడానికి అస్సాంకు అదనపు బలగాలను పంపాలని తాను ప్రధానిని కోరినట్లు ఆయన తెలిపారు.

అస్సాంలో బీహారీల హత్య పట్ల తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని అన్నట్లు ఆయన చెప్పారు.అస్సాంలోని బీహారీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని తాను ప్రధానితో చెప్పానని ఆయన అన్నారు. హింసకు వెంటనేస్వస్తి చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి