ఎస్‌పి అభ్యర్థికి నెహ్రా ప్రచారం

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 20-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు సినీ ప్రముఖులదే అయింది. ఇప్పుడు క్రికెట్‌ స్టార్స్‌ కూడా ఎన్నికల బరిలో ప్రచారానికిపూనుకుంటున్నారు. తాజాగా భారత క్రికెట్‌ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా ఢిల్లీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి బాసటగా నిలిచాడు.

ఢిల్లీలోని బాదర్పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నిఖిల్‌ నందా విలేకరుల సమావేశంలో నెహ్రా దర్శనమిచ్చాడు. నందాకు తాను మద్దతు తెలియజేయడం రాజకీయ అనుబంధాన్ని ప్రభావితం చేయబోదని నెహ్రా అన్నాడు. నందా తమ కుటుంబ మిత్రుడని, నందాను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని తాను నిర్ణయించుకున్నానని, అతను ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడనేదానితో తనకు సంబంధం లేదని నెహ్రా అన్నాడు. సమీప భవిష్యత్తులో రాజకీయాల్లో పాల్గొనే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X