నక్సల్స్‌పై ద్వంద్వవైఖరి: కాంగ్రెస్
Posted on 22-11-03
కడప: నక్సలైట్ల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ నాయకులువిమర్శించారు. కృష్ణా జిల్లాలో ఆపేసిన ప్రజాహిత బస్సు యాత్రను వారు శనివారం తిరిగి ప్రారంభించారు.
కడప జిల్లా రైల్వే కోడూరు వద్ద కాంగ్రెస్ ప్రజాహిత బస్సు యాత్ర ప్రారంభమైంది. నక్సల్స్‌ను గతంలో దేశభక్తులుగా ప్రకటించిన తెలుగుదేశం ఇప్పుడు నక్సలిజం ఎజెండాగా ఎన్నికలకు దిగుతోందని వారన్నారు. నక్సలైట్లతో చర్చలు జరపాలంటుంటే తమను నక్సల్స్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే గాటన కట్టేయడం శోచనీయమని వారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తక్కువ వడ్డీకి చేతివృత్తులవారికి రుణ సౌకర్యం కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు.
ఈ ప్రజాహిత బస్సుయాత్రలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిలతో పాటు పార్టీ అగ్రనేతలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర రాజంపేట, ఒంటిమిట్ట, తదితర ప్రాంతాల మీదుగా ఆదివారం పులివెందులకు చేరుకుంటుంది. అనంతరం అనంతపురం జిల్లాలో అడుగు పెడుతుంది.












Click it and Unblock the Notifications