27 నుంచి ఓటర్ల జాబితా సవరణ

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 22-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: ఈ నెల ను చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నారాయణరావు చెప్పారు. ఆయన శనివారం సచివాలయంలో అఖిల పక్షసమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.

కొత్త ఓటర్లను కూడా ఈ నెల 27 నుంచి నమోదు చేయనున్నట్లు నారాయణ రావు తెలిపారు. జనవరి 20వ తేదీ కల్లా తుది జాబితాను తయారు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికలు మూడు, నాలుగు నెలల్లో జరగనున్నందున ఈసారి ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చే అవకాశాలు లేవు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని గమనిస్తే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మార్చి మొదటి వారంలో జరిగే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది.

పదవ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 17వ తేదీన ప్రారంభమై ఏప్రిల్‌ మొదటి వరకు జరుగుతున్నాయి. ఆ తర్వాత పేపర్‌ వాల్యుయేషన్‌ జరుగుతుంది. అందువల్ల ఎన్నికలు ఈ పరీక్షల ప్రారంభానికి ముందే నిర్వహించే ఆలోచనలో ఎన్నికల కమీషన్‌ ఉన్నట్లు సమాచారం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి