మరో కోవర్టు నగేష్‌: వార్‌

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 22-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: మరో కోవర్టును గుర్తించినట్లు నిషిద్ధపీపుల్స్‌వార్‌ ప్రకటించింది. ఈ మేరకు పీపుల్స్‌వార్‌ నాయకురాలుఅరుణక్క పేర ఒక లేఖ విడుదలైంది.

రైతు కూలీ సంఘంలో పనిచేసిన నగేష్‌ కోవర్టుగా మారాడని పీపుల్స్‌వార్‌ ప్రకటించింది. నగేష్‌ను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి కోవర్టుగా మార్చుకున్నారని, పీపుల్స్‌వార్‌ నల్లగొండ జిల్లా నాయకుడు నవీన్‌ను చంపేందుకు నగేష్‌ను పోలీసులు కోవర్టుగా తమలోకి ప్రవేశపెట్టారని చెప్పింది. నగేష్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని పీపుల్స్‌వార్‌ ప్రకటించింది.

గతంలో నమ్మకస్థుడుగా పని చేసిన నగేష్‌ను పోలీసులు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో పట్టుకుని చిత్రహింసలు పెట్టి కోవర్టుగా మార్చుకున్నారని, నల్లగొండ జిల్లా నాయకుడు నవీన్‌ను, రాచకొండ కృష్ణపట్టి దళాలను నగేష్‌ ద్వారా హతమార్చేందుకు పోలీసులు కుట్ర పన్నారని పీపుల్స్‌వార్‌ ఆరోపించింది. అరుణక్క పేరు మీద పత్రికా ప్రకటనతో పాటు నగేష్‌ను బంధించి, అతని చేత మాట్లాడించి రికార్డు చేసిన వీడియో టేప్‌లను పీపుల్స్‌వార్‌ పత్రికా కార్యాలయాలకు, టీవీ చానళ్లకు చేరవేసింది. నగేష్‌ ఒప్పుకోలుతో కూడిన దృశ్యాలను టీవీ ఛానళ్లు శనివారం ప్రసారం చేశాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి