కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్‌ః కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర పర్యటనకు రంగంసిద్ధమైంది. ఆమె బుధవారం నుంచి మూడు రోజులపాటురాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.సోనియాగాంధీ నంద్యాల, కరీంనగర్,విజయవాడబహిరంగసభల్లో ప్రసంగిస్తారు. హైదరాబాద్‌నగరంలో రోడ్ షోలలో పాల్గొంటారు.
బుధవారం ఉదయం ఆమె బెంగుళూరునుంచి అనంతపురం చేరుకుంటారు. ఇరవై కిలోమీటర్లదూరం రోడ్డు ప్రయాణం చేసి మధ్యలో కొన్నిగ్రామాల్లో ఆగి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలనుపరామర్శిస్తారు.
ఆ తర్వాత ఆమె కర్నూలు జిల్లానంద్యాలకు హెలికాప్టర్ లో చేరుకునిరాష్ట్రంలో తొలి ఎన్నికల బహిరంగ సభలోప్రసంగిస్తారు. అదే రోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని రాజ్ భవన్‌లో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం నగరంలోనిఅనేక బస్తీలలో రోడ్ షోలలో పాల్గొంటారు. నగర శివారులోనిరామచంద్రాపురంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె కరీంనగర్‌వెళ్ళి అక్కడ బహిరంగ సభలోప్రసంగిస్తారు.
అదేరోజు రాత్రి హైదరాబాద్‌లో బస చేసి మరుసటి రోజు విజయవాడ వెళ్ళేముందు నగర శివారులో రోడ్ షోలో పాల్గొంటారని రాష్ట్రకాంగ్రెస్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడబహిరంగసభలో పాల్గొన్న అనంతరం ఆమెహైదరాబాద్ కు వచ్చి ఢిల్లీ విమానంఎక్కుతారు.












Click it and Unblock the Notifications