క్యాబినెట్ నుంచి తొలుగుతాం: టిఆర్‌యస్
హైదరాబాద్: మంత్రివర్గం నుంచి తాము వైదొలిగే విషయాన్ని ఆలోచిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి చెప్పారు. మంత్రివర్గంలో చేరడం తెలంగాణ మేధావుకు ఇష్టం లేదని, వారు మొదటి నుంచీ మంత్రివర్గంలో చేరవద్దని తమకు సూచిస్తూనే ఉన్నారని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.
మంత్రివర్గాల నుంచి తాము వైదొలిగే విషయంపై డిసెంబర్ నెలాఖరుకల్లా ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. పులిచింతల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వమని ఆయన చెప్పారు. తాము కృష్ణా డెల్టాకు వ్యతిరేకం కాదని, అయితే తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించకుండా ఇతర ప్రాజెక్టులు నిర్మించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన వివరించారు.











Click it and Unblock the Notifications
