న్యూఢిల్లీ:
అమెరికా
అధ్యక్షుడిగా
తిరిగి
ఎన్నికైన
జార్జి
డబ్వు.
బుష్‌ను
భారత
ప్రధాని
డాక్టర్
మన్మోహన్
సింగ్
భారత
పర్యటనకు
ఆహ్వానించారు.
తిరిగి
ఎన్నికైన
బుష్‌కు
ఆయన
శుభాకాంక్షలు
తెలియజేశారు.
బుష్
భారత
పర్యటన
ఉభయ
దేశాల
ద్వైపాక్షిక
సంబంధాలను
పటిష్టం
చేయగలదని
మన్మోహన్
సింగ్
ఆశించారు.
అది
ఉభయ
దేశాల
సంబంధాల
విషయంలో
మైలు
రాయి
కాగలదని
ఆయన
అన్నారు.
ప్రపంచ
శాంతిభద్రతల
పరిరక్షణకు,
భద్రతకు
అవసరమైన
తీవ్రవాదంపై
పోరులో,
సామూహిక
ఆయుధాల
విధ్వంసంలో
తమ
సహకారం
ఉంటుందని
మన్మోహన్
సింగ్
బుష్‌కు
తెలియజేశారు.
ఉభయ
దేశాల
విస్తృత
సంబంధాల
పటిష్టతకు
ఎకనమిక్
రోడ్‌మ్యాప్‌ను
రూపొందించాల్సిన
అవసరం
ఉన్నదని
ఆయన
అన్నారు.మత
తీవ్రవాదాన్ని
ప్రోత్సహించడాన్ని
వ్యతిరేకించేందుకు,
మత
తీవ్రవాదాన్ని
అంతం
చేసేందుకు
నిరంతర
కృషి
జరగాలని
ఆయన
అన్నారు.
ఈ
కృషిలో
భారత్,
అమెరికాలు
ఒకే
దారిలో
పయనిస్తున్నాయనే
విశ్వాసం
ఉన్నదని
ఆయన
అన్నారు.