చర్చలపైవైఖరి స్పష్టం చేయాలి: వరవరరావు
హైదరాబాద్:చర్చలనుంచి ప్రభుత్వం తప్పుకుంటుందనితాము అనుకోవడం లేదని సిపిఐ(మావోయిస్టు) ప్రతినిధి వరవరరావుఅన్నారు. ప్రజలు కోరుకున్నంత కాలంప్రభుత్వంతో చర్చలు జరుగుతాయనిఆయన బుధవారం విలేకరులతోఅన్నారు.
చర్చలపైప్రభుత్వం తన వైఖరిని స్పష్టంచేయాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వం నిర్బంధాన్ని అమలుచేస్తోందని ఆయన విమర్శించారు.ప్రజాస్వామిక కనీస హక్కులనుప్రభుత్వం కాలరాస్తోందని ఆయనఅన్నారు. స్థూపాల కూల్చివేత అప్రజాస్వామికచర్య అని ఆయన అన్నారు. చర్చలకూ ఈ నెలపదహారవ తేదీన జరిగేబహిరంగసభకూ సంబంధం లేదనిఆయన చెప్పారు.ఈనెల పదహారవ తేదీన జరిగే సభకుజార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌కుచెందివనారు వక్తలుగా వస్తారనినక్సల్స్ ప్రతినిధి గంగన్న చెప్పారు.రాష్ట్రానికి చెందిన వరవరరావు,కళ్యాణ రావు, గద్దర్ సభలోప్రసంగిస్తారని ఆయన చెప్పారు. ఆదిలాబాద్‌జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్నముప్పై లక్షల రూపాయలు స్థూపాలనిర్మాణం కోసం చందాలుగా సేకరించినసొమ్ము అని ఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
