పులిచింతల పనులకుహైకోర్టు బ్రేక్
హైదరాబాద్:పర్యావరణం తదితర అంశాల్లోకేంద్రం నుంచి అనుమతులు రాకుండాపులిచింతల ప్రాజె క్టు నిర్మాణ పనులుచేపట్టరాదని హైకోర్టు బుధవారంఉదయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతి లభించాకేపులిచింతల పనులు ప్రారంభించాలని, ఈ లోపు భూసేకరణ వంటిప్రాధమిక కార్యక్రమాలను కూడా ప్రారంభించడానికివీలేదని హైకోర్టుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేందర్‌గుప్తా, జస్టిస్ సివి రామన్‌స్పష్టం చేశారు.
వెంకటరెడ్డి అనేవ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. పులిచింతలనిర్మాణం వల్ల అనేక గ్రామాల ప్రజలకు నష్టంజరుగుతుందని, దీని నిర్మాణాన్ని అడ్డుకోవాలని వెంకటరెడ్డి తనపిటిషన్‌లో కోరారు. నీటి పారుదల ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలన్నరాష్ట్ర ప్రభుత్వ పట్టుదలను,ఆతృతను తాము అర్ధంచేసుకున్నామని, అయితే పర్యావరంతదితర అనుమతులు లేకుండాతొందరపాటుతో ప్రాజెక్టులను నిర్మించడం తగదని హైకోర్టువ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications
