నక్సల్స్‌ఆయుధ లైసెన్స్‌లు తీసుకోవచ్చు: దిగ్విజయ్
బెంగుళూర్:ఆయుధాలు పట్టుకోవాలనుకుంటేనక్సలైట్లు వాటికి లైసెన్స్‌లుతీసుకోవాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె.కేశవరావుతో కలిసి అనంతపురంజిల్లా పర్యటనకు వెళ్లే ముందుఆయన బెంగుళూర్‌లో విలేకరులతోమాట్లాడారు.
చట్టాన్నిప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రతి ఒక్కరూరాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరించాలని,కొంత మందికో నియమాలు ఇంకోంతమందికి మరో నియమాలు ఉండవనిఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగపరిధిలో పని చేయవలసి వుంటుందనిఆయన అన్నారు. సమస్యల శాంతియుతపరిష్కారానికి చర్చలు ఒక్కటే మార్గమని, ఈవిషయాన్ని నక్సలైట్లు కూడా గుర్తించడంహర్షణీయమని ఆయన అన్నారు.తెలంగాణవిషయంలో కాంగ్రెస్ వైఖరిలో ఏ విధమైనమార్పూ లేదని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణపై తమ వైఖరి ఒక్కటేనని, ఈవిషయంపై తమ అధ్యక్షురాలు సోనియాగాంధీ కచ్చితమైన అంచనాతో ఉన్నారని,ఆమె నిర్ణయానికి కాంగ్రెస్, తెలంగాణరాష్ట్ర సమితి కట్టుబడి వుంటాయని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications