గుంటూరు జిల్లాలోమావోయిస్టుల హింసాకాండ
గుంటూరు:గుంటూరు జిలాలో ముఖ్యమంత్రి పర్యటనకుకొద్ది గంటల ముందు మావోయిస్టులు హింసాకాండకుపాల్పడ్డారు. నకిరేకల్లు గ్రామం మాజీసర్పంచ్‌ఆదిరెడ్డి ఇంటిని శనివారంఉదయం పేల్చివేశారు. గుండపల్లిగ్రామంలో బస్సుకు నిప్పంటించారు. మందుపాతరలసాయంతో తన ఇంటిని నక్సల్స్ పేల్చివేసినసమయంలో ఆదిరెడ్డి వేరే ఊర్లో ఉన్నారు.గుండపల్లి గ్రామంలో ఆర్.టి.సి బస్సునుఆపి ప్రయాణికుల్ని కిందకు దించి బస్సుకునిప్పంటించారు. ముఖ్యమంత్రి పర్యటననుబహిష్కరించాలని స్థానిక మావోయిస్టు నేత సురేశ్ ఒక ప్రకటనలోపిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మావోయిస్టు వ్యతిరేక,ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నవై. ఎస్ అందుకు తగిన మూల్యం చెల్లిస్తారనిహెచ్చరించారు. గుంటూరు జిల్లా పల్నాడుప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టుఉంది. మాచర్లలో ముఖ్యమంత్రి బహిరంగసభకు జనం పెద్దగాహాజరుకాలేదు.












Click it and Unblock the Notifications
