అసెంబ్లీకార్యక్రమాల ప్రసారంలో పాతపద్ధతే: స్పీకర్‌

హైదరాబాద్‌:టీవీ ఛానళ్లు శాసనసభాకార్యక్రమాలను ప్రసారం చేసేవిషయంలో సెన్సార్‌ విధించకూడదనిప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయడు స్పీకర్‌ కె. ఆర్‌.సురేష్‌ రెడ్డిని కోరారు. టీవీ ఛానళ్లప్రత్యక్ష ప్రసారాలపై చర్చలో ఆయనగురువారం పాల్గొన్నారు. ఇందులో పత్రికాస్వేచ్ఛ, ప్రతిపక్షాలు మాట్లాడే స్వేచ్ఛ, ప్రజలుతెలుసుకునే హక్కు అనే అంశాలు ఇందులోఇమిడి వున్నాయని, అందువల్ల శాసనసభాకార్యక్రామాల ప్రసారం విషయంలోసెన్సారింగ్‌ విధించడం ప్రాథమికహక్కులకే భంగమని ఆయనఅన్నారు.

శాసనసభకార్యక్రమాల ప్రసారం స్పీకర్‌వ్యక్తిగత విషయం కాదని, ఇదిఅందరికీ సంబంధించిన విషయమని,తమను విశ్వాసంలోకి తీసుకొని ప్రజలకునమ్మకం కలిగించే విధంగావ్యవహరించడం అవసరమని ఆయనఅన్నారు. సాంకేతిక పరిజ్ఞానంగణీయంగా అభివృద్ధి చెందిందని, సభాకార్యక్రమాల కవరేజీని చేపట్టినప్రస్తుత ఏజెన్సీకి పెద్దగా అనుభవంలేదని ఆయన అన్నారు. కవరేజీబాధ్యతలను ఒక ఎలక్ట్రానిక్‌ మీడియాసంస్థకు అప్పగించి, నాలుగు దిక్కులా నాలుగుకెమెరాలు పెడితే నేరుగాకార్యక్రమాలు టీవీ ఛానళ్లకు వెళ్లేఅవకాశం ఉంటుందని, అప్పుడు టీవీఛానళ్లు తమకు ఇష్టమైన రీతిలోవాటిని వాడుకుంటాయని ఆయనవివరించారు.

సభలోజరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రజలుతెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని,ప్రింట్‌ మీడియాపై ఆంక్షలు లేనప్పుడుటీవీ ఛానళ్లపై ఆంక్షలు విధించడంఎందుకని ఆయన అన్నారు. మీ మీదనమ్మకం పెరగాలంటే మా అందరినీవిశ్వాసంలోకి తీసుకుని నిర్ణయాలుచేయండి అని చంద్రబాబు స్పీకర్‌నుఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+