పాక్ క్రికెట్‌అభిమానులకు 10వేల ఇండియన్ వీసాలు
న్యూఢిల్లీ:భారత్-పాక్ జట్ల మధ్య మార్చిలోమనదేశంలో జరుగనున్న క్రికెట్‌సిరీస్‌ను తిలకించేందుకు పాకిస్ధానీయులకు ఉదారంగా అవకాశంకల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దాదాపు పదివేలమంది పాకిస్ధానీయులకు వీసాలు మంజూరు చేసే అవకాశముంది.క్రికెట్‌సందర్భంగా వేలాదిమంది సరిహద్దు దాటడం ఉభయదేశాల దౌత్యచరిత్రలోమధుర ఘట్టంగా నిలిచిపోతుంది.మనదేశం పాకిస్ధాన్‌లోప్రత్యేకంగా వీసా మేళా నిర్వహించనుంది. మొహాలీలోజరుగనున్న మ్యాచ్‌కు పాక్ క్రికెట్‌అభిమానులు రోడ్డు మార్గంలో కార్లలోరావడానికి కూడా అనుమతించేఅవకాశముంది. సరిహద్దుకు మొహాలీ క్రికెట్‌గ్రౌండ్ మూడున్నర గంటల డ్రైవ్ దూరంలో ఉండడంతో ఈప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. గతఏడాది పాక్‌లో జరిగిన మ్యాచ్‌లను చూసేందుకుపాకిస్ధాన్ ప్రభుత్వందాదాపు ఎనిమిది వేల మంది భారతీయులకుఅవకాశం కల్పించింది.












Click it and Unblock the Notifications