వైఎస్‌కాగజ్ నగరబాట, హామీల మూట
హైదరాబాద్:ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిరాజీవ్ నగర యాత్ర శనివారంఉదయం ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. కాగజ్‌నగర్‌లో డిఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించినఅనంతరం ఆయన బహిరంగసభలోప్రసంగించారు. ఎన్నికల్లో మాట ఇచ్చినవిధంగా చేనేత కార్మికులను ఆదుకుంటామని ఆయన అన్నారు.కాగజ్‌నగర్ పట్టణంలోని మంచి నీటిసమస్యను ఆయన ప్రముఖంగాప్రస్తావించారు. గతంలో నీటి కనెక్షన్‌కోసం ఏడు వేల రూపాయలు కట్టవలసి వచ్చేదని, దానిని పన్నెండు వందలకుతగ్గించి నెలకు వంద రూపాయలచొప్పున ఏడాది పాటు దశలవారీగా చెల్లించికనెక్షన్లను తాము మంజూరు చేసినట్టు ఆయనచెప్పారు. ఇందిరమ్మరాజ్యం తెస్తామని తాము హామీ ఇచ్చామని,ఇందిరమ్మ రాజ్యమంటే పేదల రాజ్యమనిఆయన అన్నారు. అందువల్ల పేదలసంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications