మంచిర్యాలజిల్లా ఏర్పాటును పరిశీలిస్తాం: వైఎస్
ఆదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లాను రెండుగా విభజించాలన్నచిరకాల డిమాండ్‌కు ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డి శనివారంఅనుకూలంగా ప్రతిస్పందించారు. రాజీవ్‌నగర బాట కార్యక్రమంలో భాగంగాఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, బెల్లంపల్లి పట్టణాల్లో పర్యటించి వివిధకార్యక్రమాల్లో పాల్గొన్నారు. బెల్లంపల్లి బహిరంగ సభలో ప్రసంగించినముఖ్యమంత్రి మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేసేవిషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులకుప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు.సింగరేణి కాలరీస్ ఉద్యోగులవేతనాలను పెంచే విషయాన్ని కంపెనీ యాజమాన్యంతోచర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగజ్ నగర్ పట్టణాభివృద్ధికిరెండు కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టుముఖ్యమంత్రికాగజ్‌నగర్ బహిరంగ సభలోప్రకటించారు. అంగన్‌వాడివర్కర్లకు వంద రూపాయలవేతనం పెంచుతున్నట్టు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications