సోమశేఖరకమీషన్ విచారణపై హైకోర్టు స్టే
హైదరాబాద్:జస్టిస్ సోమశేఖర కమీషన్ విచారణపైమంగళవారం హైకోర్టు స్టే ఇచ్చింది.ఏలేరు కుంభకోణంపై సోమశేఖరకమీషన్ విచారణ జరుపుతోంది. ఏలేరుభూసేకరణలో అవకతవకలుజరిగాయనే ఆరోపణలపై ఈ విచారణజరుగుతోంది. అయితే కమీషన్‌నిష్పాక్షితను సవాల్ చేస్తూతెలుగుదేశం నాయకులు కడియంశ్రీహరి, పి. అశోక్ గజపతి రాజు హైకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతంసోమశేఖర కమీషన్ విశాఖపట్నంలో విచారణకొనసాగిస్తోంది. ఈ నెల 24వ తేదీన తనముందు హాజరు కావాల్సిందిగా సోమశేఖరకమీషన్ కొందరికి సమన్లు జారీచేసింది. ఇంతకు ముందుహైదరాబాద్‌లో కమీషన్ ముందుహాజరైన అశోక గజపతి రాజు తీవ్రంగాకలత చెందారు. కమీషన్ వేసినప్రశ్నలకు ఆయన తీవ్ర మనస్తాపానికిగురయ్యారు. ఆ తర్వాతే హైకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications
