గనమెన్‌నియామకంలో అవకతవకలు: రవిభార్య సునీత
అనంతపురం:తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడుపరిటాల రవి హత్యపై ఆయన సతీమణిపరిటాల సునీత మొదటిసారి బుధవారంమీడియా ఎదుట తన పెదవి విప్పారు.పరిటాల హత్య జరిగి బుధవారంనాటికికచ్చితంగా నెల రోజులు అవుతోంది. పరిటాలహత్యపై శాసనసభలో ఒక వైపుచర్చ జరుగుతుండగా మరో వైపుసునీత తన అభిప్రాయాన్ని మీడియాకువినిపించారు.
ప్రభుత్వంపరిటాలహత్య కేసును నీరుగార్చే ప్రయత్నంచేస్తోందని ఆమె విమర్శించారు. కేసులోఅసలు దోషులను వదిలేసి,అనవసరమైన వారిని విచారిస్తున్నారనిఆమె అన్నారు.
పరిటాలగన్‌మెన్ నియామకంలోఅవకతవకలు జరిగాయని సునీతఆరోపించారు. మూడు రోజుల ముందుగానేపరిటాల హత్యకు రూపకల్పన జరిగిందనిఆమె అన్నారు. మంత్రి జె.సి. దివాకర్‌రెడ్డి, ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడువై.యస్. జగన్మోహన్ రెడ్డి,మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డిఅలియాస్ సూరి భార్య భానుమతి,రాయలసీమ ఐజి మీనా, కొండారెడ్డి పేర్లుఎఫ్ ఐ ఆర్‌లో ఉన్నాయని ఆమె అంటూ వారిని ఎందుకువిచారించలేదని అడిగారు.
తమకుటుంబ సభ్యులకు ఇంకా ప్రాణభయంఉందని ఆమె అన్నారు. పరిటాల గురించి మాట్లాడేఅర్హత మంత్రి జె.సి. దివాకర్ రెడ్డికిలేదని ఆమె అన్నారు. పరిటాలపై 40కేసులున్నాయని పోలీసు డైరెక్టర్‌జనరల్ (డిజిపి) స్వరణ్‌జిత్ సేన్‌అనడం అన్యాయమని ఆమె అన్నారు.తెలుగుదేశం కార్యకర్తలపైపెట్టిన కేసులను ఉపసంహరించాలని ఆమెప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
