అన్నిరంగాల్లో ప్రభుత్వం విఫలం: టిడిపి
హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోవిఫలమైందని తెలుగుదేశంశాసనసభ్యుడు యనమలరామకృష్ణుడు విమర్శించారు. బడ్జెట్‌పైచర్చలో ఆయన మంగళవారంప్రభుత్వంపై తీవ్ర విమర్శనాస్త్రాలుసంధించారు. అన్ని రంగాల్లో అభివృద్ధికుంటుపడిందని ఆయన అన్నారు.వ్యవసాయ రంగంలో పెరుగుదలపడిపోయిందని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకుచేసిందేమీ లేదని ఆయన అన్నారు. ఉచితవిద్యుత్, బలహీన వర్గాల గృహనిర్మాణం, సంక్షేమ రంగాలనుప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపైఆయన విమర్శలు చేశారు. రెవెన్యూలోటు, ఆర్థిక లోటు తగ్గడానికి తమప్రభుత్వం చేపట్టిన చర్యలేకారణమని ఆయన అన్నారు.
ప్రపంచబ్యాంక్ విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వంతన వైఖరిని స్పష్టం చేయాలని సిపియంసభ్యుడు తమ్మినేని వీరభద్రండిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలకుఅనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులులేవని ఆయన అన్నారు. నక్సల్స్‌తోచర్చలను అర్థాంతరంగా ఆపేయడంసరి కాదని ఆయన అన్నారు.నక్సలైట్లను విప్లవానికి పుట్టినవికృత శిశువులుగా ఆయనఅభివర్ణించారు. నక్సల్స్‌తో చర్చించేపద్ధతులేమిటనేది ప్రభుత్వంఆలోచించుకోవాలని ఆయన సూచించారు. బడ్జెట్‌లోకేటాయింపులకు, ఖర్చులకు పొంతనలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications