పార్లమెంటువద్ద టిడిపి ధర్నా: కెకె మండిపాటు
న్యూఢిల్లీ:రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలనునిరసిస్తూ తెలుగుదేశం పార్లమెంటుసభ్యులు మంగళవారంనాడుపార్లమెంటు ధర్నా చేశారు. రాష్ట్రంలోకాంగ్రెస్ అధికారంలోకి వచ్చినతర్వాత రైతుల ఆత్మహత్యలుపెరిగిపోయాయని తెలుగుదేశంపార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.ఎర్రంనాయుడు ఈ సందర్భంగావిమర్శించారు. రైతుల ఉత్పత్తులకుగిట్టుబాటు ధర లభించడం లేదని, దీంతోరైతుల ఆత్మహత్యలుజరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగుదేశంపార్లమెంట్ సభ్యుల ధర్నాపైప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుతీవ్రంగా మండిపడ్డారు. రైతులఆత్మహత్యలను రాజకీయంచేయవద్దని ఆయన తెలుగుదేశంపార్టీకి సూచించారు. మిర్చి పంట ధరకు,రైతుల ఆత్మహత్యలకు ముడిపెట్టడంసరి కాదని ఆయన అన్నారు. ఆయనప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీఅధ్యక్షురాలు సోనియా గాంధీతోసమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications