నక్సల్స్‌ఆత్మవిమర్శ చేసుకోవాలి: జానారెడ్డి
హైదరాబాద్:మావోయిస్టులు ఆత్మ విమర్శ చేసుకోవాలనిహోం మంత్రి కె. జానారెడ్డి సూచించారు.కర్నూలు జిల్లా వేంపెంట సంఘటనపైఆయన మంగళవారం విలేకరులసమావేశంలో మాట్లాడుతూ ఆ సూచనచేశారు. అంతకు ముందు ఆయనవేంపెంట సంఘటనపై పోలీసు డైరెక్టర్‌జనరల్ (డిజిపి) స్వరణ్‌జిత్‌సేన్‌తోనూ, ఇతరఉన్నతాధికారులతోనూ చర్చించారు.తప్పు చేసినవారిని శిక్షించే హక్కుమావోయిస్టులకు లేదని ఆయన అన్నారు.శవాలను తీసుకురావడానికి ఏర్పాట్లుజరుగుతున్నాయని ఆయన అన్నారు.మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షలరూపాయలు ఎక్స్‌గ్రేషియాచెల్లించనున్నట్లు, అర్హులైనవారుఉంటే కుటుంబంలోని ఒక్కొక్కరికి ఉద్యోగంఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢసానుభూతి తెలియజేశారు.
అవాంఛనీయసంఘటనలు జరగకుండా వేంపెంటకుఅదనపు బలగాలను తరలించినట్లుఆయన తెలిపారు. ప్రతీకార చర్యలుజరగకుండా సంయమనం పాటించాలనిఆయన వేంపెంట గ్రామవాసులకు విజ్ఞప్తిచేశారు. గ్రామంలో 60 శాతం మందిమాలమాదిగాలేనని, బిసీలు ఉన్నారని,దేవుని మాన్యం సాగు విషయంలోఘర్షణలు జరుగుతున్నాయని ఆయనచెప్పారు.
తప్పుచేసినవారికి ఆలోచన కలిగే విధంగానచ్చజెప్పే పని చేయాలి తప్ప వారినిచంపడం సరి కాదని ఆయన అన్నారు.మావోయిస్టులను మోసం చేయాల్సినఅవసరం తమకు లేదని, ప్రజలుమోసపోకూడదనేదే తమఉద్దేశ్యమని ఆయన అన్నారు.మావోయిస్టులకు ఇష్టమా కాదా అనేదిప్రధానం కాదని, ప్రజల ఇష్టానుసారంప్రభుత్వం నడుచుకుంటుందని ఆయనచెప్పారు. మానవహక్కుల సంఘాలనాయకులు, ప్రజాస్వామిక వాదులు,ఆలోచనాపరులు వేంపెంట సంఘటననుముక్తకంఠంతో ఖండించాలని ఆయనకోరారు.
జానారెడ్డిహెలికాప్టర్‌లో వేంపెంట బయలుదేరివెళ్తున్నారు. ఆయనతో పాటు డిజిపి కూడాబయలుదేరి వెళ్లే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications