18నగోవర్ధన్‌ రెడ్డిని హాజరు పర్చండి:కోర్టు

అనంతపురం:తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవి హత్యకు బాధ్యత వహిస్తూప్రకటన చేసిన విప్లవదేశభక్తపులుల సంస్థ నాయకుడుపటోళ్ల గోవర్ధన్‌ రెడ్డిని, రామిస్వామిని ఈనెల 18వ తేదీన తమ ముందు హాజరుపరచాల్సిందిగా అనంతపురం ఫస్టుక్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. సైబరాబాద్‌పోలీసుల చేతికి చిక్కిన గోవర్ధన్‌ రెడ్డిపరిటాల హత్య తన ఆదేశాల మేరకేజరిగిందని చెప్పాడు. పరిటాల రవిని ప్రధానషూటర్‌ జూలకంటి శ్రీనివాస్‌ రెడ్డి, రెండోషూటర్‌ నారాయణ రెడ్డి తన ఆదేశాలమేరకే హత్య చేశారని ఆయనచెప్పాడు.

తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవి హత్య కేసులో గంగుల భానుమతిముందస్తు బెయిల్‌కుఅనంతపురం కోర్టులో పిటిషన్‌ దాఖలుచేసుకుంది. రవి హత్య కేసులో ప్రధానసూత్రధారి అని భావిస్తున్న మద్దెలచెర్వుసూర్యనారాయణ రెడ్డి అలియాస్‌ సూరిభార్య భానుమతి. భానుమతిశాసనసభ ఎన్నికల్లో పరిటాల రవిపైపెనుకొండ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగాపోటీ చేసి ఓడిపోయారు. పరిటాల రవిహత్య కేసులోని ఎఫ్‌ఐఆర్‌లో భానుమతిపేరు ఉంది.

ఇదిలాఉండగా, విప్లవ దేశభక్త పులులనాయకుడు గోవర్ధన్‌ రెడ్డిని తమకస్టడీకి అప్పగించాలని కేంద్ర దర్యాప్తుసంస్థ (సిబిఐ) అనంతపురం కోర్టులోపిటిషన్‌ దాఖలు చేసింది. తనఆధ్వర్యంలోనే పరిటాల రవిని జూలకంటిశ్రీనివాస్‌ రెడ్డి, నారాయణ రెడ్డి హత్యచేశారని గోవర్ధన్‌ రెడ్డిచెప్పుకుంటున్నాడు. ఒక హత్య కేసులోగోవర్ధన్‌ రెడ్డిని సైబరాబాద్‌ పోలీసులుఅరెస్టు చేశారు. గోవర్ధన్‌రెడ్డినిప్రశ్నించేందుకు సిబిఐ నిర్ణయించుకొనిఅతడ్ని తమ కస్టడీకి అప్పగించాలనికోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+