వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల హామీలుఏమయ్యాయి?- చంద్రబాబు ప్రశ్న

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలహామీలను విస్మరించిందని తెలుగుదేశంఅధినేత చంద్రబాబు నాయుడు బుధవారం అసెంబ్లీలో విమర్శించారు.రైతులు, చేనేత కార్మికులుఆత్మహత్యలు చేసుకోకుండా వారికిఅండగా నిలుస్తామని ఎన్నికల ముందు హామీఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు చేతులెత్తేసిందని ఆయనఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలలకాలంలోనే 249 మంది చేనేత కార్మికులుఆత్మహత్య చేసుకున్నారని ఆయనజిల్లాల వారీగా లెక్కలు చదివి విన్పించారు.ఆత్మహత్య చేసుకున్న చేనేతకార్మికులకు ఒకొక్కరికి లక్షన్నరచొప్పున రాష్ట్ర ప్రభుత్వం, యాభై వేలచొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉందని, ఆ డబ్బునుప్రభుత్వం విడుదల చేసిందా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రశ్నలకుగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి.శ్రీనివాస్‌ జవాబుఇచ్చారు. గత పదేళ్ళుగా చేనేతకార్మికుల సమస్యలు పేరుకు పోతూ వస్తున్నాయని,అయినప్ప్పటికీ ఈ తొమ్మిది నెలల్లో తాము ఎంతోచేశామని శ్రీనివాస్‌ చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తిచెందని చంద్రబాబు నాయుడు, ఇతరటిడిపి సభ్యులతో కలిసి వాకౌట్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X