ఈశ్వరయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి అనుచరుడు ఈశ్వరయ్య మృతదేహానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఆధ్వర్యంలో ఆదివారం రీపోస్టుమార్టం జరిగింది. అయితే కొత్త ఆధారాలేవీ లభించలేదని అధికార వర్గాలు చెప్పాయి. పరిటాల రవి మృతదేహానికి ఇప్పటికే రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈశ్వరయ్య మృతదేహానికి, పరిటాల గన్‌మన్ బాషా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని సిబిఐ అధికారులు అప్పుడే నిర్ణయం తీసుకున్నారు.
ఈశ్వరయ్య మృతదేహానికి దర్మవరం స్మశానవాటిలో రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈశ్వరయ్య మరణించిన రెండు నెలలు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. రీపోస్టుమార్టంలో మెటల్ డిటెక్టర్లు వాడారు. రవి మృతదేహం రీపోస్టుమార్టంలో మెటల్ డిటెక్టర్లు వాడలేదు. బాషా మృతదేహానికి సోమవారం రీపోస్టుమార్టం నిర్వహిస్తారు. ఈశ్వరయ్య మృతదేహానికి ఖనానికి ముందు అనంతపురం మెడికల్ కాలేజీ నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు. అప్పుడు లభించిన ఆధారాలే తప్ప రీపోస్టుమార్టంలో కొత్త ఆధారాలేవీ లభించలేదు.












Click it and Unblock the Notifications