తెలంగాణ వెనకబాటు పాపం టిడిపిదే: వైయస్
హైదరాబాద్: గత పదేళ్ల తెలుగుదేశం పాలనే తెలంగాణ వెనుకబాటుకు కారణమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ నగరబాట నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ జలాలను అందిస్తామని ఆయన చెప్పారు. స్కాలర్‌షిప్‌ల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ఎబివిపి) కార్యకర్తలు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డగించారు. అయితే ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో వారు వైదొలిగారు. ఇండ్ల స్థలాల కోసం సి ఐటియు కార్యకర్తలు సియం కాన్వాయ్‌కి అడ్డం వెళ్లారు. వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టారు. ఆ తర్వాత సి ఐటియు కార్యకర్తలు సమాచార, పౌరసంబంధాల మంత్రి షబ్బీర్ అలీ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
రాష్ట్రంలో సేద్యం నీటి రంగం తర్వాత గృహనిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇండ్లు లేనివారు 40 లక్షల మంది ఉన్నారని, వచ్చే ఐదేళ్లలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని, రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజీన్ నగరబాటలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు డి. శ్రీనివాస్, జె. గీతారెడ్డి ఉన్నారు.












Click it and Unblock the Notifications
