విశాఖలోని ఎస్‌బిఐలో భారీ దోపిడీ
విశాఖపట్నం: విశాఖపట్నంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (యస్‌బిఐ) దొండపర్తి శాఖలో దోపిడీ జరిగింది. పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను దోపిడీదారులు దోచుకుని పోయినట్లు సమాచారం. ఈ దోపిడీ బుధవారం అర్థరాత్రి జరిగినట్లు సమాచారం. దోపిడీదారులు బ్యాంక్ పై భాగం నుండి లోనికి ప్రవేశించి, గ్రిల్స్ విరగగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. సేఫ్ డిపాజిట్ లాకర్లను కూడా దోపిడీదారులు పగులగొట్టారు.
పోలీసులు శునకాలను రంగంలోకి దించారు. శునకాలు రైల్వే స్టేసన్ వరకు వెళ్లి తిరిగి వచ్చాయి. దీన్ని బట్టి అంతర్రాష్ట్ర ముఠా ఈ దోపిడీకి పాల్పడి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 50 లక్షల రూపాయల నగదు దొంగతనం జరిగినట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
