వెంకటనగరంపై చర్చ: టిడిపి బహిష్కరణ
రాజమండ్రి: వెంకటనగరం పంపింగ్ స్కీమ్‌పై ఆదివారం బహిరంగ చర్చ జరిగింది. ఈ చర్చను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. చర్చలను నీరు గార్చడానికి పెద్ద ప్రాజెక్టులను పక్కన పెట్టి చిన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం బహిరంగ చర్చను నిర్వహిస్తోందని తెలుగుదేశం ప్రతినిధి సానా మారుతి విమర్శించారు. చిన్న ప్రాజెక్టులపై చర్చ అవసరం లేదని ఆయన అన్నారు. పోలవరం కింది అన్ని ప్రాజెక్టులను కలిపి చర్చను నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉండేదని ఆయన అన్నారు.
ప్రాజెక్టు వివరాలను ఇంటర్నెట్‌లో పెట్టకపోవడంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రతినిధి తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారని ఆయన విమర్శించారు. నిర్వాసితులకు వెంటనే సహాయ పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications