డిజిపి, ఐజిలవి మతిభ్రమించిన మాటలు: టిడిపి
హైదరాబాద్: పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్‌జిత్ సేన్, ఐజి మీనా మతిభ్రమించి మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు కె. విద్యాధరరావు, డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా డిజిపి, ఐజిలు ఆరోపణలు చేస్తున్నారని వారు ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు.
ఆర్‌వోసి నుంచి ప్రాణహాని ఉన్నదని ప్రకటించడం ఐజి మీనా అసమర్థతకు నిదర్శనమని వారన్నారు. పెనుకొండకు నాయకులు వెళ్లవద్దని ప్రకటించడాన్ని కూడా వారు వ్యతిరేకించారు. ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే పద్ధతిలో పోలీసు అధికారులు మాట్లాడటం సరి కాదని, ఏ సంప్రదాయం ఆ హక్కు ఇచ్చిందని వారన్నారు.












Click it and Unblock the Notifications