మహారాష్ట్ర నిర్వాకంపై 26 నుంచి బిజెపి ఉద్యమం
కరీంనగర్: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా ఉత్తర తెలంగాణలో ఉద్యమం చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. ఈ ఉద్యమం ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. మండల స్థాయిలో ఉద్యమాలు చేపట్టి ఎమ్మార్వోలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
మహారాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణంపై అఖిల పక్ష కమిటీ వేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర నిర్వాకారాన్ని ఆపించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణంపై ఇటీవల బిజెపి కరీంనగర్‌లో సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు తెలుగుదేశంపార్టీ నాయకులు కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications