వరంగల్‌లో 9 మంది నక్సల్స్ లొంగుబాటు
వరంగల్: వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) స్టీఫెన్ రవీంద్ర ఎదుట మంగళవారంనాడు తొమ్మిది మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో ఇద్దరు మావోయిస్టులు, జనశక్తి, ప్రజాప్రతిఘటన, సిపియుయస్ ఐ నక్సలైట్లు ఉన్నారు. వీరిలో ఒకరు లోకల్ గెరిల్లా దళ కమాండర్ కాగా, మరొకరు డిప్యూటీ కమాండర్. మావోయిస్టులు లింగం తిరుపతి, ఆయన భార్య రమ లొంగిపోపయినవారిలో ఉన్నారు.
అనారోగ్య కారణాల వల్ల, విప్లవం రాదనే ఉద్దేశంతో తాము లొంగిపోతున్నట్లు వారు చెప్పారు. వీరికి 25 వేల రూపాయలేసి చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. తప్పుదోవ పట్టి నక్సలైట్లలో కలవకూడదని, హత్యలకు, విధ్వంపాలకు పాల్పడుతున్న నక్సలైట్లు వైపు ఆకర్షితులు కావద్దని ఆయన ప్రజలను కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications