ఎమ్మెస్‌కు ఎటువంటిసిఫార్సు చేయలేదు: కేశవరావు
గుంటూరు:దేవాదాయ శాఖ మంత్రిఎం.సత్యనారాయణరావుకు తానుఎటువంటి సిఫార్సులు చేయలేదని పిసిసిఅధ్యక్షుడు కె.కేశవరావు శనివారంగుంటూరులో అన్నారు. దేవాదాయ శాఖ భూముల అమ్మకంకుంభకోణం మీడియా సృష్టి అని ఆయనవ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణజరుగుతున్నందున తానేమీ వ్యాఖ్యానించదలచుకోలేదని ఆయనఅన్నారు. దేవాదాయ శాఖ మంత్రికి తానుఒక సిఫార్సు చేసిన మాట వాస్తవమని,అయితే సాధ్యాసాధ్యాలను అధికారులుపరిశీలించాలని, తాను తిరుమల దేవస్ధానాన్ని తన పేరు మీద రాయాలనికోరితే, అది సాధ్యమౌతుందా అని గతంలోప్రకటించిన కేశవరావు మాటమార్చడం గమనార్హం. శాంతియాత్రలో భాగంగా గుంటూరు జిల్లాకువచ్చిన కేశవరావు వివిధ పట్టణాల్లోపర్యటించారు.












Click it and Unblock the Notifications
