హింసను వీడితేనే నక్సల్స్‌తో చర్చలు: జానారెడ్డి
న్యూఢిల్లీ: హింసావాదాన్ని విడనాడితేనే నక్సలైట్లతో రెండో విడత చర్చలు జరుగుతాయని రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధునాతన ఆయుధాలను, వాహనాలను ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన సోమవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ అధునాత ఆయుధాల కోసం విధివిధానాలను ఆయన రూపొందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నాయకులను మావోయిస్టులు బెదిరించడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులకు తగిన భద్రత కల్పిస్తామని ఆయన చెప్పారు. మావోయిస్టులు హింసావాదాన్ని విడనాడాలని ఆయన కోరారు.
కేంద్రం నుంచి అధునాత ఆయుధాలను తీసుకోవడం ప్రజారక్షణకే కానీ నక్సలైట్ల అణచివేతకు కాదని ఆయన అన్నారు. సమాజానికి ఆధునాతన ఆయుధాలు అవసరమని ఆయన అన్నారు. ఎవరినో భయపెట్టడానికి లేదా అణచివేయడానికి అధునాతన ఆయుధాలను కోరుతున్నామనేది నిజం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
